WGL: నర్సంపేట మండలంలో నూతనంగా ఎన్నికయిన సర్పంచ్ లను, పాలకవర్గాన్ని NSPT మార్కెట్ ఛైర్మన్ పాలాయి శ్రీనివాస్ సోమవారం సన్మానించారు. లక్నెపల్లి సర్పంచ్ అయిలోని రజిత-అశోక్, రామవరం సర్పంచ్ యర్నం అనిత-మోహన్ మరియు పాలకవర్గంకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన నూతన సర్పంచ్లకు సూచించారు.