CTR: చిత్తూరు కలెక్టరేట్ వద్ద సోమవారం మామిడి రైతుల ధర్నాకు కొంతమంది పిలుపునిచ్చినట్లు సమాచారం అందింది. అయితే ఈ ధర్నాకు అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేదని DSP సాయినాథ్ తెలిపారు. అనుమతి లేకుండా నిర్వహించే ధర్నాల్లో ఎవరైనా పాల్గొంటే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమస్య పైన రైతు సంఘ నాయకులు, రైతులు అర్జీ సమర్పించాలన్నారు.