PPM: పేదలకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉన్న వాళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. మండలంలోని జమదాల గ్రామానికి చెందిన గొట్టాపు విద్యాసాగర్ కుటుంబ సభ్యులకు మంజూరైన CMRF రూ. 2,05,657కు చెక్కును ఇవాళ ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.