మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి రామచంద్రయ్య అనారోగ్య కారణాలతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా ఓబీసీ సెల్ ఛైర్మన్ తిరుపతి మృతుడి భౌతిక కాయానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంత్యక్రియల నిమిత్తం ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.