ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సాన్ కొనియాడారు. భారత్తో ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA)పై ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందం ద్వారా భారత్కు తమ ఎగుమతుల్లో 95 శాతంపై సుంకాలు తొలగిపోతాయని వెల్లడించారు.