SDPT: గ్రామాల్లో బీజేపీపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్ నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు. కోహెడ మండలంలోని తీగలకుంటపల్లి, మైసంపల్లి, విజయనగర్ కాలనీ, బత్తులవానిపల్లి గ్రామాలకు చెందిన నూతన సర్పంచులు, వార్డుసభ్యులు సోమవారం ఆయన కార్యాలయంలో కలిశారు. వారిని శాలువాలతో సన్మానించిన బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయడారనికి సహకరిస్తానన్నారు.