GNTR: మంగళగిరిలోని తెనాలి ఫ్లై ఓవర్ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని అతివేగంగా వచ్చిన స్విఫ్ట్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.