MBNR: జిల్లాలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సైబర్ నేరాల బాధితులకు ఊరటనిచ్చింది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 77 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించి, రూ. 16,96,579 రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా సైబర్ నేర బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఆమె పేర్కొన్నారు.