SDPT: గజ్వేల్ అటానామస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుమ్ తెలిపారు. పుష్కల్ అగ్రిటెక్ లిమిటెడ్, సింధూజ మైక్రో క్రెడిట్ ప్రైవేటు లిమిటెడ్ వంటి కంపెనీలు ఇంటర్/డిప్లొమా, ఏదైనా డిగ్రీ అర్హత గల అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు.