WNP: ఖిల్లా ఘణపురం మండలం రోడ్డుమీదితండా గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా దేవుజ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. పంచాయతీ భవనంలో జరిగిన కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గాన్ని అభినందించారు. సర్పంచ్ దేవుజ, ఉప సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.