నిజామాబాద్‌లో జరిగిన 3వ జిల్లా స్థాయి మైనారిటీ క్రీడా పోటీల్లో లింగంపేట విద్యార్థులు అద్భుత ప్రతిభకనబరిచారు. వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, టెన్నికోయిట్, మార్పాస్ట్ విభాగాల్లో విజేతలుగా నిలిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నట్లు ప్రిన్సిపల్ వెంకట్రాములు తెలిపారు. విజేతలను ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.