KRNL: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం రద్దును ఉపసంహరించుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి శ్రీరాములు, సీపీఐ మండల కార్యదర్శి సుల్తాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన చట్టాన్ని బలహీనపరిచేలా కేంద్రం తెచ్చిన కొత్త బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.