SDPT: కోహెడ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా బందెల సుజాత బాలకిషన్ సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో ఆమె మాట్లాడుతూ.. పాలకవర్గ సభ్యులతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.