AP: తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కృష్ణాపురంలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కృష్ణాపురంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలందరికీ నివాస స్థలాలు ఇవ్వాలన్నదే చంద్రబాబు ధ్యేయమన్నారు.