GNTR: టీడీపీ గుంటూరు జిల్లా నూతన అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు సోమవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాసరావుపేటలోని మాధవి నివాసంలో మాణిక్యరావు కలిసిన సందర్భంగా మొక్కను బహుకరించి శాలువాతో ఎమ్మెల్యే సత్కరించారు. పార్టీ శ్రేణులను అందరినీ కలుపుకొని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.