GDWL: నిత్యం వందలాది మంది భక్తులు స్నానాలకు వచ్చే గద్వాల జిల్లా బీచుపల్లి ఘాట్లలో చెత్త పేరుకుపోవడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధంగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. పవిత్రమైన కృష్ణానదిని మురుగునీటి కుంటగా మారుతుంటే ఎలా చూస్తూ కూర్చుండాలని భక్తులు పేర్కొన్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు పేర్కొన్నారు.