NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో నూతనగా ఎన్నికైన సర్పంచ్ జోగు రమణమ్మ, ఉప సర్పంచు భీమయ్యను ఈరోజు కల్వకుర్తి ఎంపీడీవో వెంకటరాములు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించి, గ్రామాన్ని అభివృధి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లింగం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.