SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని మార్క్స్ నగర్లో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు కలెక్టర్ ప్రావీణ్యకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. 15 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌కు కలెక్టర్ ఆదేశించారు.
Tags :