NLR: కందుకూరు పరిసర ప్రాంతాల్లో పొగాకు సాగు చేస్తున్న రైతులు తమ బ్యారెన్ల లైసెన్సును సోమవారంలోపు నమోదు చేసుకోవాలని పొగాకు వేలం కేంద్రాల నిర్వహణ అధికారి శివకుమార్ సూచించారు. సోమవారంతో గడువు ముగుస్తుందని, ఆ తర్వాత రూ.400 పెనాల్టీ వర్తిస్తుందని తెలిపారు. లైసెన్స్ రీన్యూవల్కూ ఇదే నిబంధనలు అమలులో ఉంటాయని చెప్పారు.