NDL: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 44వ రాష్ట్ర మహాసభలు సోమవారం ఒంగోలులో జరిగాయి. ఈ మేరకు నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నంద్యాలకి చెందిన లక్ష్మీ నరసింహను ఎన్నుకున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు నూజిల్ల శ్రీనివాస్ తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.