RR: షాబాద్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ నూతన సర్పంచిగా పీ.సుధాకర్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా వెంటనే డ్రైనేజీ పనులు ప్రారంభించి కార్యాచరణకు నాంది పలికారు.