NZB: రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో వెటర్నరీ శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందు వేసే శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సుమలత ప్రారంభించారు. మొత్తం 158 గొర్రెలు, మేకలకు మందు తాగించి, పెంపకం దారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేష్, వార్డు మెంబర్ దత్తాత్రేయ, నందిగామ కృష్ణ, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.