AP: సినిమా, కల్చర్, లిటరేచర్పై ప్రభుత్వం అమరావతి ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించనుంది. జనవరి 8 నుంచి 10 వరకు అమరావతి ఫెస్టివల్ జరగనుంది. అవకాయ్ పేరుతో AP టూరిజం శాఖ ఈ కార్యక్రమం చేపట్టనుంది. ప్రాచీన కళల పట్ల ఆసక్తితో చేస్తున్న పండుగ ఇది అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అమరావతిని సాహితీ, కళా రాజధానిగా చేసే ప్రక్రియ అని తెలిపారు.