TG: మహబూబాబాద్ జిల్లా దామరవంచలో గందరగోళం నెలకొంది. సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేయడానికి ఇద్దరు పోటీ పడ్డారు. అధికారులు సర్పంచ్ ఎన్నికల్లో మొదట స్వాతి గెలిచినట్లు ప్రకటించారు. రీకౌంటింగ్ తర్వాత ఒక్క ఓటుతో సుజాత గెలిచింది. అయితే, ఎన్నికల అధికారులు ఇద్దరికీ ధ్రువపత్రాలు అందజేయడంతో.. ఇద్దరూ ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.