కృష్ణా జిల్లా 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో లక్ష్యంగా ఉన్న 1,45,588 మంది చిన్నారుల్లో 1,39,024 మందికి (95.49%) పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తామని చెప్పారు.