SRD: ఖేడ్ మండలం సంజీవనరావుపేట ప్రాథమిక పాఠశాల నేడు జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ సంఖ్య ఆకారంలో ప్రదర్శించారు. ఆయన గణితానికి చేసిన సేవలను గొప్పగా చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి ఉపాధ్యాయులు ధర్మేందర్, సుదర్శన్, విద్యార్థులు పాల్గొన్నారు.