వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 3 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,250 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,500 ధర పలకగా..వండర్ హాట్(WH) మిర్చి రూ.18,000పలికింది. తేజ మిర్చి ధర రూ.14,050 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.