TG: వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ శ్వేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పాటల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో రెండు పార్టీల నాయకులు పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఒకరికి గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు.