ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో మీనగట్ట అటవీప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని గుర్తించి దానిని ధ్వంసం చేశారు. అనంతరం ఆ కర్మాగారం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.