MDK: చిన్నశంకరంపేట గ్రామ సర్పంచ్‌గా ఎన్ఆర్ఎ కంజర్ల చంద్రశేఖర్ సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గెజిటెడ్ అధికారి రవీందర్ రెడ్డి.. సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ భానుప్రసాద్, 12 మంది వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామని నూతన పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు.