MBNR: కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వివాహిత అదృశ్యమైన ఘటన బాలానగర్ మండలంలో జరిగింది. ఎస్సై లెనిన్ తెలిపిన ప్రకారం యూపీకి చెందిన కృష్ణమోహన్ పాండే–శ్యామలత దంపతులు ఇక్కడ నివసిస్తున్నారు. గొడవ అనంతరం భర్త పనికి వెళ్లగా శ్యామలత పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.