BDK: ఇల్లందు మండలం మసివాగు గ్రామంలో అయ్యప్ప స్వామి పడిపూజ, ఇరుముడి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. అయ్యప్ప మాలదారుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప చల్లని దీవెనలు గ్రామస్తులపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ రాంబాబు పాల్గొన్నారు.