NGKL: ప్రతి ఆదివారం కొల్లాపూర్ రాజవీధిలో జరిగే వారాంతపు సంతలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం సాయంత్రం కలియతిరిగారు. సంతలో ప్రత్యేకించి కూరగాయల దుకాణం వద్దకు వెలికి టమాటా, వంకాయ ఇతర కూరగాయలు నాణ్యత ప్రమాణాలను మంత్రి పరిశీలించారు. మార్కెట్ కిలో ధర ఎంత అని మంత్రి జూపల్లి విక్రయదారురాలిని అడిగి తెలుసుకున్నారు.