ASR: జీ.మాడుగుల ఎస్సైగా బోనంగి సాయి పడాల్ సోమవారం నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా పనిచేసిన షణ్ముఖరావు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఖాళీగా ఉన్న ఆయన స్థానంలో చింతపల్లి మండలం లంబసింగి గ్రామానికి చెందిన సాయి పడాల్ను ఉన్నతాధికారులు నియమించారు. బదిలీపై వెళుతున్న ఎస్సై షణ్ముఖరావును స్థానిక మండల ప్రజాప్రతినిధులు, నేతలు ఘనంగా సన్మానించారు.