VZM: కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన తూర్పు భాగవతం కళాకారుడు బొంతలకోటి శంకరరావు నియామకం అయ్యారు. నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రామకృష్ణ బాబు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పద్మజ్యోతి అందజేశారు. ఈ సందర్భంగా శంకర రావు మాట్లాడుతూ.. జిల్లాలో కళాకారుల సమస్యల పరిష్కారానికి పని చేస్తానని తెలిపారు.