AP: పల్నాడు జిల్లాలో కలకలం రేపిన అడిగొప్పల జంట హత్యలపై ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా తీశారు. ఈ మేరకు జిల్లా SP కృష్ణారావుతో మాట్లాడి.. నిందితులు ఎంతటివారైనా విడిచి పెట్టొద్దని, ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నేరాలపై కౌన్సెలింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.