అన్నమయ్య: చిట్వేల్ టౌన్ పాత పోస్టాఫీస్ ఎదుట ఇవాళ ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో టిఫిన్ సెంటర్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా రేకుల షెడ్ ఒక్కసారిగా కూలిపోయింది. పాత భవనం కావడంతో సన్సైడ్ గోడ కూలినట్లు సమాచారం. ఘటన సమయంలో అక్కడ పనులు చేస్తున్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. భారీ ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.