నల్గొండ కలెక్టరేట్లో ఇవాళ ‘ప్రజావాణి’ కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంటలకు ‘ప్రజావాణి’ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోడ్ వల్ల కొన్ని వారాలపాటు ఈ కార్యక్రమంను అధికారులు నిర్వహించలేదు. తిరిగి ఈ సోమవారం నుంచి యధావిధిగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని బాధితులు వారి సమస్యలను, ఫిర్యాదులను అందించవచ్చని తెలిపారు.