ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించగా.. 19 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు అతి వేగంతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించామని, డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొట్టాడని అధికారులు తెలిపారు.