WGL: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన బీటెక్ 3వ, 5వ, 7వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఈనెల 22 నుంచి జరగాల్సిన పరీక్షలను పరిపాలనా కారణాలతో వాయిదా వేసి, డిసెంబర్ 29 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి టైం టేబుల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.