W.G: నరసాపురం మండలం ఎల్.బి. చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 13 గ్రామాల్లో 92% మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు వైద్యాధికారి మాధురి తెలిపారు. ఆదివారం మొత్తం 3,976 మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయడం ద్వారా నూరు శాతం లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.