NLG: వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామ నూతన సర్పంచ్‌గా పిల్లల సందీప్ పదవి బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ ఆఫీసర్ భూక్య లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.