NLG: చిట్యాల మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:15 గంటలకు వట్టిమర్తి, 12:45కు వనిపాకల, మధ్యాహ్నం 1:30 గంటలకు చిన్నకాపర్తి గ్రామాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నరసయ్య తెలిపారు.