NRPT: కృష్ణ మండలంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంపత్ రెడ్డి గ్రూప్-3 ఫలితాల్లో సత్తా చాటారు. విధి నిర్వహణలో ఉంటూనే పట్టుదలతో శ్రమించి సచివాలయంలోని వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టును కైవసం చేసుకున్నారు. నాలుగేళ్లుగా కానిస్టేబుల్‌గా సేవలందిస్తున్న ఆయన, నేడు ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.