వరంగల్ ములుగు రోడ్డు పెద్దమ్మ గడ్డ కాకతీయ కెనాల్ వద్ద ఉన్న ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏడాదిగా అధ్యాపకులు లేకపోవడం వల్ల తరగతులు జరగట్లేదని, తమ భవిష్యత్తు ఎలా అని ప్రశ్నిస్తూ ములుగు రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ స్పందించి తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని ప్లకార్డులు ప్రదర్శించారు.