కోనసీమ: ఆత్రేయపురం మండలంలో ఇవాళ ‘మన ఊరు – మన బాధ్యత’ కార్యక్రమం నిర్వహించారు. కాలువ రేవు ప్రాంతంలో పెరిగిన పిచ్చి మొక్కలను చిన్నారులతో కలిసి స్వచ్ఛందంగా తొలగించారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు పాల్గొని పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.