NGKL: నేరగాళ్లు ప్రవేశపెట్టిన ‘ఘోస్ట్ పెయిరింగ్’ స్కామ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఊర్కోండ ఎస్సై కృష్ణ సూచించారు. స్మార్ట్ ఫోన్ వాడకం పెరుగుతున్న కొద్దీ నేరగాళ్లు చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, తెలిసిన వారి నుంచి సందేశాలు వచ్చినా ముందుగా ఫోన్ కాల్ ద్వారా నిర్ధారించుకోవాలని తెలిపారు.