VSP: డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై ప్రచార కరపత్రాన్ని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. వినియోగదారులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.