VSP: ఉక్కు భూ నిర్వాసితులకు శాశ్వత న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 4న పాత గాజువాక నుంచి భిక్షాటన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాసితుల జేఏసీ సోమవారం ప్రకటించింది. పెద నడుపూడు కళావేదికలో జరిగిన సమావేశంలో అధ్యక్షులు పితాని భాస్కర ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.