కోనసీమ: రైతుల నుండి నీటి తీరువా పన్నులు వసూళ్లు చేయడంలో అలసత్వం చేయకుండా త్వరితగతిన పన్నులు వసూలు చేయాలంటూ అమలాపురం మండల వీఆర్వోలకు తహసీల్దార్ వి ఎస్ దివాకర్ ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం విఆర్వోలతో నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై తహసీల్దార్ దివాకర్ చర్చించారు. నీటి తీరువా పన్నులు సకాలంలో వసూలు చేయాలన్నారు.